హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ట్రాన్స్ట్రాయ్ కంపెనీ డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుతోపాటు ట్రాన్స్‌ట్రా య్ కంపెనీలోని కీలక వ్యక్తి మాలినేని సాంబశివరావుకు చెందిన కార్యాలయాలతోపాటు, డైరెక్టర్ల ఇండ్లలోనూ ఈడీ అధికారులు సోదా లు చేస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 27లోని రా యపాటి నివాసంతోపాటు, హైదరాబాద్, గుంటూరు కార్యాలయాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. 13 బ్యాంకుల నుంచి రూ.9 వేల కోట్లకుపైగా రుణాలు తీసుకొని, వాటిని షెల్ కంపెనీలకు తరలించారని గతంలో వీరిపై కేసు నమోదైంది. ట్రాన్స్ట్రాయ్ కంపెనీ బ్యాంకు ఖాతా ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా సింగపూర్‌కు నగదు బదిలీ అయిందని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. బ్యాంకు రుణాల ఎగవేత కేసులో 2019లో రాయపాటి ఇల్లు, కార్యాలయాలపై సీబీఐ సోదాలు చేసింది.