MLA Gaddam Vivek | హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నేత గడ్డం వివేక్‌పై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన ఖాతా నుం చి రూ.8 కోట్ల బదిలీపై సమాచారం అందుకున్న ఈడీ అధికారులు.. ఈసీ ఆదేశాలతో కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి గురువారం ఈడీ అధికారులు ఆయనను వి చారించారు. విజిలెన్స్ సెక్యూరిటీ, విశాఖ ఇం డస్ట్రీస్ పేరుతో జరిగిన అక్రమ లావాదేవీలపైనే ఈడీ అధికారులు దృష్టి సారించినట్టు తెలిసింది. ముఖ్యంగా ఎమ్మెల్యే వివేక్‌కు చెందిన బోగస్ కంపెనీల నుంచి జరిగిన రూ.200 కోట్ల అక్రమ లావాదేవీల గుట్టు విప్పేందుకు సుమారు 4 గంటలపాటు పలు ప్రశ్నలు సం ధించినట్టు విశ్వసనీయ సమాచారం. గత న వంబర్‌లో విశాఖ ఇండస్ట్రీస్, విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాల్లో తనిఖీల్లో దొరికిన ఆధారాలతో మంచిర్యాల, హైటెక్‌సిటీ, సోమాజిగూడ, రామగుండంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. వివేక్ అకౌంట్ నుంచి విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు రూ.8 కోట్లు బదిలీ విషయమై చేపట్టిన సోదాల్లో రూ.200 కోట్లకుపైగా అక్రమాలు వెలుగుచూశాయి. గతంలో ఈడీ అధికారులు జరిపిన సోదాల్లో విజిలెన్స్ సెక్యూరిటీ సంస్థ.. ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనలు ఉల్లంఘించినట్టు తేల్చారు. అయితే, ఈ సెక్యూరిటీ సంస్థకు ‘యశ్వంత్ రియల్టర్స్’ మాతృసంస్థగా ఉన్నదని గుర్తించారు. ఓ బోగస్ సంస్థకు యశ్వంత్ రియల్టర్స్ మాతృసంస్థగా ఎలా అవతరించిందనే అంశంపై వివేక్ నుంచి వివరాలు రాబట్టారు. యశ్వంత్ రియల్టర్స్‌లో ఫెమా నిబంధనలకు విరుద్ధంగా విదేశీయుల షేర్లు ఎక్కువగా ఉన్నట్టు గతంలో ఈడీ అధికారులు తేల్చారు. యశ్వంత్ రియల్టర్స్‌తో ఉన్న సంబం ధం, వివేక్ పాత్రపై స్పష్టత తీసుకున్నారని తెలిసింది.
ఈడీ విచారణ ఎదుర్కొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్.. తాను ఫెమా నిబంధనలు ఉల్లంఘించలేదని మీడియాతో చెప్పారు. తాను బీజేపీ నుంచి బయటకు వచ్చాకే ఈడీ సోదాలు జరిగాయని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి వ్యక్తిగత కక్షతో సోదాలు చేయించాయని ఆరోపించారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని, మరోసారి విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని ఈడీ అధికారులు స్పష్టం చేసినట్టు వెల్లడించారు. ఏవైనా పత్రాలు అవసరమైతే సమర్పించడానికి సిద్ధంగా ఉండాలని ఈడీ సూచించిందని పేర్కొన్నారు.
విశాఖ ఇండస్ట్రీస్, విజిలెన్స్ సెక్యూరిటీస్ నుంచి తరచూ రూ.100 కోట్ల లావాదేవీలు ఎలాంటి నిజమైన వ్యాపార హేతుబద్ధత లేకుండాజరిగినట్టు ఈడీ గతంలోనే గుర్తించింది. అప్పుడే ఆ డబ్బు కూడా విజిలెన్స్ సెక్యూరిటీ రాబడి కాదని ఆధికారులు వెల్లడించారు. ఆ సంస్థ రాబడి కానప్పుడు రూ.100 కోట్లు ఎవరెవరికి ఇచ్చారు? అవి చేతులెలా మారాయి? అనే ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. రూ.20 లక్షల ఆదాయం మాత్రమే వస్తే రూ.వంద కోట్ల లావాదేవీలు ఎలా జరిగాయో చెప్పాలని అడిగినట్టు సమాచారం. ఈ రెండు కంపెనీలను వివేక్ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలా నియంత్రిస్తున్నారో ప్రశ్నించినట్టు తెలిసింది. దర్యాప్తులో భాగంగా విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ కంపెనీని ఈడీ అధికారులు ఓ బోగస్ సంస్థగా తేల్చారు.