హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): ఎంబీఎస్ జ్యువెలరీ సంస్థ అధినేత సుఖేశ్‌గుప్తా, ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జ్యువెల్స్, అనురాగ్‌గుప్తా, కర్రి రవిప్రసాద్, వల్లూరి మోహన్‌రావుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దాఖలు చేసిన ఈ ఫిర్యాదును హైదరాబాద్‌లోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. ప్రభుత్వ రంగంలోని ఎంఎంటీసీ సంస్థకు సుఖేశ్‌గుప్తా రూ.504 కోట్లు ఎగ్గొట్టారని, దీనిపై ఈడీ ఇప్పటికే పీఎంఎల్ఏ, ఫెమా చట్టాల కింద విచారణ జరిపి, పలు ఆస్తులను జప్తు చేసింది.
హైదరాబాద్, మార్చి 4(నమస్తే తెలంగాణ): ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్(యూజీ) ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 7తో ముగియనున్నది. ఇప్పటివరకు నీట్‌కు 21 లక్షలకుపైగా దరఖాస్తులొచ్చినట్టు తెలిసింది.