ఐఎంఎస్ కేసులో ఈడీ చార్జిషీట్
సంచలనం సృష్టించిన బీమా వైద్య సేవల (ఐఎంఎస్) కుంభకోణం కేసులో ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి సహా 15 మందిని ఈడీ నిందితులుగా చేర్చింది.
- దేవికారాణి సహా నిందితులుగా 15 మంది
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): సంచలనం సృష్టించిన బీమా వైద్య సేవల (ఐఎంఎస్) కుంభకోణం కేసులో ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి సహా 15 మందిని ఈడీ నిందితులుగా చేర్చింది. మొత్తం రూ.211 కోట్ల కుంభకోణం జరిగినట్టు నిర్ధారించిన ఈడీ, విచారణ పూర్తిచేసి చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో నిందితులకు చెందిన రూ.144 కోట్ల ఆస్తులను ఇప్పటికే జప్తుచేసింది. ఏసీబీ నమోదు చేసిన 8 ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగిస్తున్నది.
వైద్యం చేయకుండానే చేసినట్టు, మందులు కొనకుండానే కొన్నట్టు తప్పుడు లెక్కలు చూపడంతోపాటు తకువ ధరకు కొనుగోలు చేసి లెకల్లో ఎకువ చూపడం ద్వారా కొందరు ఐఎంఎస్ అధికారులు భారీ కుంభకోణానికి పాల్పడినట్టు 2019లో ఏసీబీ కేసు నమోదు చేసింది. దాని ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ అధికారులు విచారణ చేపట్టి స్వాహా చేసిన డబ్బులతో నిందితులు బిల్లులు లేకుండా బంగారం కొనుగోలు చేసినట్టు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించారు. వీటితోపాటు హైదరాబాద్, బెంగళూరు, నోయిడాల్లో విల్లాలు, ఓపెన్ ప్లాట్లు, భూములు కొనుగోలు చేసినట్టు గుర్తించి, వాటినీ అటాచ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

