హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ హబీబ్నగర్కు చెందిన రౌడీషీటర్ ఖైసర్ ‘పహిల్వాన్’పై ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) దాఖలైంది. అతనిపై విచారణ ప్రారంభించాలని హైదరాబాద్ పోలీసులు.. ఈడీకి లేఖ రాశారు. హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య దర్యాప్తు ప్రారంభించి, పలు క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు. అక్రమంగా భారీగా ఆస్తు లు కూడబెట్టాడని, భూకబ్జాలు, దోపి డీ తదితర 22 క్రిమినల్ కేసుల్లో ఇతడి ప్రమేయం ఉన్నదని, తన అక్రమ కార్యకలాపాలతో దాదాపు రూ.100 కోట్ల వరకు సంపాదించినట్టు తెలిపా రు. 2011లో నగర బహిష్కరణ త ర్వాత, మళ్లీ హైదరాబాద్కు వచ్చి, నేర కార్యకలాపాలు ప్రారంభించాడు. 2014లో పీడీ చట్టం కింద ఖైసర్ను నిర్బంధించి చర్లపల్లి జైలులో ఉంచారు.