హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): రుణాలు తీసుకుని బ్యాంకును మో సం చేసిన కేసులో చదలవాడ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. గతంలో సీబీఐ కేసు ఆధారంగా కంపెనీతోపాటు డైరెక్టర్ చ దలవాడ రవీంద్రబాబు తదితరులపై మరో కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేస్తున్నది.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెల 3న హైదరాబాద్, ఒంగోలులో ఎనిమిది చోట్ల సోదాలు చేపట్టారు. చదలవాడ ప్రాపర్టీ డాక్యుమెంట్లను రికవరీ చేశారు. పవర్ ఇన్ఫ్రాస్టక్చర్ ప్రాజెక్టు కోసం రూ.166.93 కోట్లు ఎస్బీఐ నుంచి రుణాలు తీసుకుని వాటిని దారి మళ్లించారని, ఉద్యోగులు, డైరెక్టర్లు, ఇతరుల పేరిట భారీగా ఆస్తులు కొనుగోలు చేశారని ఈడీ గుర్తించింది.