విత్తన గణపతుల పంపిణీ
రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌కుమార్ నేతృత్వంలో గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా గురువారం హైదారాబాద్‌లో విత్తన గణేశ్ విగ్రహాల పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంతోష్‌కుమార్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విత్తన గణపతులను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.
- ప్రారంభించిన మాజీ ఎంపీ సంతోష్
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌కుమార్ నేతృత్వంలో గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా గురువారం హైదారాబాద్‌లో విత్తన గణేశ్ విగ్రహాల పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంతోష్‌కుమార్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విత్తన గణపతులను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. విత్తన విగ్రహాలను స్వచ్ఛమైన మట్టి, కోకోపీట్ లేదా కోకో పౌడర్‌తో వివిధ రకాల విత్తనాలతో తయారుచేసినట్టు చెప్పారు.
పూజ అనంతరం ఈ విగ్రహాలను మట్టిలో లేదా పెద్ద కుండలో ఉంచితే, కొన్ని రోజుల తర్వాత విత్తనాలు మొలకెత్తుతాయని వివరించారు. నిర్దిష్ట పరిమాణంలోకి వచ్చిన తర్వాత వాటిని తిరిగి అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లు లేదా పారుల్లో మట్టిలో నాటవచ్చని తెలిపారు. పర్యావరణ, ఆరోగ్య ప్రయోజనాల కోసం చింతపండు, వేప వంటి చెట్లను ఎకువగా పెంచాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన సలహా మేరకు విత్తన గణపతి విగ్రహాలను ప్రతి ఏటా పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు.
విత్తన గణపతి కార్యక్రమంలో భాగంగా ఔషధ విలువలు కలిగిన మొకలను నాటేలా ప్రణాళిక చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు కరుణాకర్‌రెడ్డి, రాఘవ, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
2018లో గ్రీన్ చాలెంజ్ ప్రారంభం
తెలంగాణలో గ్రీన్ కవర్‌ను మెరుగుపరచడానికి ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమం స్పూర్తితో 2018లో గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను సంతోష్‌కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు అమితాబ్‌బచ్చన్, సంజయ్‌దత్, అజయ్‌దేవగన్, కృష్ణ, చిరంజీవి, పవన్‌కల్యాణ్, సచిన్ టెండూలర్, పుల్లెల గోపీచంద్, సానియా గోపీచంద్, పీవీ సింధు, నాగార్జున, ప్రభాస్, మహేశ్‌బాబు, రాజమౌళి, సమంత, శృతిహాసన్, శ్రద్ధాకపూర్ వంటి ప్రముఖులు పాల్గొని మొకలు నాటారు. కొంతమంది ప్రముఖులు అడవులను దత్తత సైతం తీసుకున్నారు. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని మరింతగా విస్తరించి ప్రముఖుల పుట్టినరోజులు, బీఆర్ఎస్ నేతల బర్త్ డే, వివాహ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున మొకలు నాటారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

