సిద్దిపేట ఆర్బన్, ఏప్రిల్ 9: ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన ఉద్యోగులపై ఈసీ కొరడా ఝుళిపించింది. సోమవారం రాత్రి జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని రెడ్డి ఫంక్షన్హాల్లో ఓ రాజకీయ పార్టీ సమావేశంలో పాల్గొన్నందుకు సిద్దిపేట జిల్లాకు చెందిన 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేయాలని ఈసీ ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనుచౌదరి ఆ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. సస్పెండ్ అయిన 38 మంది సెర్ప్ ఉద్యోగుల్లో.. ఏపీఎంలు 14 మంది, సీసీలు 18 మంది, వీవోఏలు నలుగురు, ఒక సీబీ ఆడిటర్, ఉపాధి హామీ పథకానికి చెందిన 68 మంది ఉద్యోగుల్లో.. ఏపీవోలు నలుగురు, ఈసీలు ఏడుగురు, టీఏలు 38 మంది, సీఈవోలు 18 మంది, ఒక ఎఫ్ఏ ఉన్నారు.