హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): రాజకీయ పార్టీలు తమ వార్షిక ఖర్చులు, ఎన్నికల ఖర్చుల వివరాలను ఇకపై ఆన్లైన్లో సమర్పించేందుకు భారత ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా https://iems.eci.gov.in/ వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఏ పార్టీలైనా తమ ఖర్చుల వివరాలను మ్యాన్యువల్‌గా కాకుండా వెబ్‌పోర్టల్‌లోనే సమర్పించాలని సూచించింది. తద్వారా పార్టీలకు సమయం ఆదా కావడంతోపాటు నిర్ణీత సమయంలో వివరాలను అందించేందుకు వీలు కలుగుతుందని వెల్లడించింది. ఆన్లైన్లో వివరాలను సమర్పించేందుకు వీలుకాని పార్టీలు నేరుగా హార్ట్కాపీలను అందించవచ్చని, అయితే, ఇందుకు కారణాలను వివరించాల్సి ఉంటుందని తెలిపింది.