e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home Top Slides ఆస్తుల మీదే ఈటల యావ

ఆస్తుల మీదే ఈటల యావ

ఆస్తుల మీదే ఈటల యావ
  • తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే స్వభావం నీది
  • పథకాలపై పల్లెత్తుమాటన్నా సహించేదిలేదు
  • కేసీఆర్‌ అంతటి అవకాశాలను పొందావు
  • సీఎంపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం
  • ఈటలపై మండిపడిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి

పార్టీలో సీనియర్‌, అప్పటికే మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావును కాదని 2009లో ఈటలకు అసెంబ్లీలో ఫ్లోర్‌లీడర్‌గా అవకాశమిచ్చారు. స్వరాష్ట్రంలో తొలి ఆర్థికమంత్రిని చేశారు. పార్టీలోనూ.. ప్రభుత్వంలోనూ నంబర్‌2గా అవకాశాలు కల్పించిన పార్టీ మీద, నేత మీద ఇష్టారీతిగా మాట్లాడటమంటే తల్లిపాలు తాగి రొమ్ముగుద్దటమే.

హైదరాబాద్‌, జూన్‌ 4 (నమస్తే తెలంగాణ):ఆత్మగౌరవం లేదని ఐదేండ్ల క్రితమే గ్రహిస్తే అప్పుడే ఎందుకు రాజీనామా చేయలేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షు డు పల్లా రాజేశ్వర్‌రెడ్డి నిలదీశారు. ఈటలది ఆస్తుల మీద గౌరవమే కానీ.. ఆత్మగౌరవం కాదని అన్నారు. శుక్రవారం టీఆర్‌ఎస్‌ఎల్పీలో పల్లా మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రపంచం మొత్తం కీర్తిస్తున్నదని.. అలాంటి పథకాలను విమర్శిస్తే సహించేది లేదన్నారు. పార్టీలో ఉన్నప్పు డు ఈటలకు కేసీఆర్‌ దేవుడు.. గొప్పవాడని.. ఈరోజు దెయ్యం అయ్యాడా? అని నిలదీశారు. టీఆర్‌ఎస్‌ స్థాపకుడు, స్వరాష్ట్ర సాధకుడు, బంగారు తెలంగాణ రథసారథి కేసీఆర్‌ను పల్లెత్తు మాటన్నా ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్టీలో సీనియర్‌, అప్పటికే మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావును కాదని 2009లో ఈటలకు అసెంబ్లీ ఫ్లోర్‌లీడర్‌గా అవకాశమిచ్చారని, స్వరాష్ట్రంలో తొలి ఆర్థికమంత్రిని చేశారని గుర్తుచేశారు. పార్టీలోనూ.. ప్రభుత్వంలోనూ నంబర్‌టూగా అవకాశాలు కల్పించిన పార్టీమీద, నేతమీద ఇష్టారీతిగా మాట్లాడటమంటే తల్లిపాలు తాగి రొమ్ముగుద్దటమేనని చెప్పారు.

బడుగుల గురించి మాట్లాడే హక్కులేదు
ఈటలకు ఎస్సీ, ఎస్టీ, బీసీవర్గాల మీద ప్రేమ ఉంటే వారి ఆస్తులను ఎట్లా ఆక్రమిస్తారని పల్లా ప్రశ్నించారు. చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న భూములను ఎట్లా కాపాడుకోవాలె అన్న ఆలోచనే తప్ప.. ఈటల తపన ఆత్మగౌరవం గురించి కాదని ఎద్దే వా చేశారు. ఆ ఆస్తుల రక్షణకే ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారని అన్నారు. ప్రపంచమే గొప్పదని కీర్తిస్తున్న రైతుబంధు పథకాన్ని ఈటల అవహేళన చేసి మాట్లాడటం సిగ్గుచేటన్నారు.

సామాన్యుడి ఫిర్యాదుకూ స్పందన ప్రజాస్వామ్యానికి ప్రతీక
సామాన్యుడి ఫిర్యాదుపై సీఎం తక్షణం స్పందించడం, మంత్రిపైనే విచారణకు ఆదేశించడం ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్నదడానికి నిదర్శనమని పల్లా చెప్పా రు. సామాన్యుడు, బలహీనుడు ఫిర్యాదు చేస్తే బాధ్యతగల ప్రభుత్వానిధినేతగా స్పందించటం నియంతృత్వమా? అప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. వైద్యఆరోగ్యశాఖమంత్రిగా ఈటల ఎంత బద్ధకంగా వ్యవహరించారో? అధికారులను ఎలా వేధించారో? ఆ శాఖలో అందరికీ తెలుసన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులను ఎంతోమందిని వేధించారని, ఎస్సీ అధికారిని తన పేషీలోంచి మార్పించలేదా? అని ప్రశ్నించారు. హుజూరాబాద్‌ ప్రజలు, నాయకులంతా టీఆర్‌ఎస్‌ వెంటే ఉన్నారని.. ఈటలతో ఎవరూ వెళ్లలేదని తెలిపారు. ఒక్కడిగానే వచ్చాడు.. ఒక్కడిగానే వెళ్లిపోయారు అని పేర్కొన్నారు.

చట్టం నుంచి తప్పించుకోలేరు: గువ్వల
దళితుల భూములను ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందో ముందుగా ఈ టల సమాధానం చెప్పాలని విప్‌ గువ్వల బాలరాజు డిమాండ్‌చేశారు. ఆయన ఎన్ని మాటలు చెప్పినా చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు. మతాలు, కులాలు, దేవుళ్ల పేరుతో సమాజంలో చిచ్చుపెడుతున్న బీజేపీలోకి వెళుతున్న ఈటలకు హుజూరాబాద్‌ ప్రజలు బుద్ధి చెప్తారన్నారు.

ఆత్మగౌరవం తాకట్టు: బాలసాని
బహుజనుల ఆత్మగౌరవాన్ని ఈటల బీజేపీ నేతల కాళ్లదగ్గర తాకట్టుపెట్టారని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ విమర్శించారు. వివాహం చేసుకోవటమే ఆద ర్శం కాదని.. సెకండ్‌ జనరేషన్‌, పిల్లల పే ర్లు, వారి సంబంధ బాంధవ్యాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఈటల తన పిల్లలకు ‘రెడ్డి’ అని పేరుపెట్టడం ఎలా ఆదర్శమవుతుందని ప్రశ్నించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆస్తుల మీదే ఈటల యావ

ట్రెండింగ్‌

Advertisement