East Coast Express | ఈస్ట్‌కోస్ట్ రైలులో పొగలు.. వారంలో రెండోసారి..!
East Coast Express | సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా హౌరాకు వెళ్తున్న ఈస్ట్‌కోస్ట్‌లో రైలులో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు చైన్‌ను లాగి ట్రైన్‌ను నిలిపివేశారు.
East Coast Express | సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా హౌరాకు వెళ్తున్న ఈస్ట్‌కోస్ట్‌లో రైలులో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు చైన్‌ను లాగి ట్రైన్‌ను నిలిపివేశారు. ఈ ప్రమాదం వరంగల్ జిల్లా నెక్కొండ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. అకస్మాత్తుగా వచ్చిన పొగలు బోగీలను కమ్మేశాయి. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక పరుగులు పెట్టారు. ఆ తర్వాత రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
ట్రైన్ బ్రేక్ లైనర్లు పట్టేయడంతో పొగలు వచ్చినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఎలాంటి ప్రమాదం జరుగలేదని పేర్కొన్నారు. అయితే, ఈస్ట్‌కోస్ట్ రైలులో పొగలు రావడం ఇది వారంలో రెండోసారి. ఐదురోజుల కిందట మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుడ్రాతమడుగు రైల్వే స్టేషన్‌కు దగ్గరలో పొగలు వచ్చాయి. ప్రయాణికులు రైలును నిలిపివేశారు. పొగలు రావడానికి ఓ ప్రయాణికుడు కారణంగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మహబూబాబాద్ రైల్వేస్టేషన్లో ట్రైన్ చైన్ లాగి వదిలేయడంతో బ్రేకులు పట్టేశాయని, దాంతో ఒక్కసారిగా పొగలు వచ్చాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రైమ్ మినిస్టర్ అంబానీ!
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

