రంగారెడ్డి,నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) గెలుపుబాటలో పయనిస్తున్న టీఆర్ఎస్ను దెబ్బ తీసేందుకు, బీజేపీ గుంట నక్కలు ఆడుతున్న నాటకం బట్టబయలైంది. బీజేపీ ఓటమి ఖాయమనుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అనుచరులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు.
ఆధార్‌లో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఎస్ శ్యాంసుందర్‌రెడ్డి. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం కమ్మదనం గ్రామంలోని న్యూ కాలనీ నివాసి.(ఈ గ్రామం గతంలో మహబూబ్‌నగర్ జిల్లాలో ఉండేది). ఈయన బీజేపీ కార్యకర్త. మునుగోడు నియోజకవర్గం కేతుపల్లికి చెందిన వాడిగా చెప్పుకొంటూ.. టీఆర్ఎస్ అధినేతను దుర్భాషలాడుతూ వీడియో చిత్రీకరించాడు. సంక్షేమ పథకాల్ని హేళన చేస్తూ వాగాడు. ఇప్పటికే ఓటమి భయం పట్టుకున్న బీజేపీకి ఈ విధంగానైనా సాయపడదామన్నట్టు షార్ట్ ఫిల్మ్ తీసి తప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాడు.
ప్రజలు బీజేపీ దుష్ట రాజకీయాలను తిప్పికొడుతున్నారు. అవాస్తవ వీడియోలను గుర్తించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నారు. బీజేపీ బురదలో బొర్లుతూ.. టీఆర్ఎస్కూ అంటించే కుయుక్తులను టీఆర్ఎస్ అభిమానులు తిప్పికొడుతున్నారు.