హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): నగరంలో తరచూ డ్రగ్స్ పట్టుబడుతున్న 8 పబ్‌లపై ఈగల్ టీమ్ దృష్టిసారించింది. వాటిల్లో ప్రిజం, ఫార్మ్, బర్డ్‌బాక్స్, బ్లాక్ 22, వాక్ కోరా, క్వాక్ అరేనా, క్షోరా పబ్‌లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ వినియోగదారుల లిస్టును రూపొందిస్తున్నట్టు ఓ ఉన్నతాధికారి చెప్పారు.
పరారీలో ఉన్నవారిపై ఎల్వోసీ జారీచేసే అవకాశం ఉన్నదని తెలిపారు. తమ దృష్టికి వచ్చిన వారిలో 15మంది డాక్టర్లు ఉన్నారని తెలిపారు. మల్నాడు రెస్టారెంట్లో డ్రగ్స్ దొరికిన వైనంపై ప్రత్యేక దృష్టిసారించినట్టు సమాచారం.