కంటోన్మెంట్/బొల్లారం. జూన్ 2: తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపును ఇచ్చి, సరైన న్యాయం చే యాలని తెలంగాణ ఉద్యమకారుల హక్కుల ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మూల్యా సంజీవ్ డిమాండ్ చేశారు. పరేడ్ మైదానంలో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో కవులు, కళాకారులు, ఉద్యమకారులను సన్మానించిన కాంగ్రె స్ ప్రభుత్వానికి తాను కనిపించలేదా? అని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆదివారం బోయిన్పల్లి తెలంగాణ తల్లి విగ్రహం ముందు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. ఉద్యమకారులను గౌరవించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నదని గుర్తు చేశారు.