పీడీఎఫ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థికి డీవైఎఫ్ఐ మద్దతు
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం పీడీఎఫ్ (పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్) ఎమ్మెల్సీ అభ్యర్థి కొల్లి సత్యనారాయణకు డీవైఎఫ్ఐ (భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య) మద్దతు ప్రకటించింది
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం పీడీఎఫ్ (పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్) ఎమ్మెల్సీ అభ్యర్థి కొల్లి సత్యనారాయణకు డీవైఎఫ్ఐ (భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య) మద్దతు ప్రకటించింది. శనివారం హైదరాబాద్ చికడపల్లిలోని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేశ్, ఆనగంటి వెంకటేశ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నాయని ఆరోపించారు. అందుకే కొల్లి సత్యనారాయణకు మద్దతిస్తున్నట్టు తెలిపారు.
‘సర్’ పేరుతో అక్రమంగా ఓట్ల తొలగింపు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈసీని ఏజెంట్ సంస్థగా వాడుకుంటూ సర్ ప్రక్రియ పేరుతో ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నదని డీవైఎఫ్ఐ నేతలు ఆరోపించారు. ఓట్ల చోరీకి పాల్పడుతున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని, ఓటు హకును కాపాడుకునేందుకు నవంబర్ 1, 2, 3 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నట్టు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- chikkadpally
- DYFI
- sir
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

