హైదరాబాద్, జూన్11(నమస్తే తెలంగాణ): ఇసుక సహా వివిధ గనుల తవ్వకాలకు వార్షిక క్యాలెండ ర్ రూపొందించి టెండర్లు పిలువాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార అధికారులను ఆదేశించారు. గతంలోకన్నా ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించాలని ఆయన కోరారు. మంగళవారం సచివాలయంలో ఆయ న గనుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇసుక రీచ్‌లను ఆయా ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు కేటాయిస్తే ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే అవకాశం ఉంటుందా? అనే అంశంపై సమగ్ర సర్వే నిర్వహించాలని గనుల శాఖ అధికారులను డిప్యూటీ సీఎం కోరారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ హరిత, స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాసర్ తదితరులు పాల్గొన్నారు.