DV Srinivas Rao | కుమ్రం భీం ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీగా డీవీ శ్రీనివాస్ రావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో పని చేసే ఉద్యోగులు, ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలోని సీఐలు, ఎస్ఐలు ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు. నేరాలను అరికట్టేందుకు కృషి చేస్తానని శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. పీపుల్ ఫ్రెండ్లీ పోలిసింగ్ విధానాన్ని అవలంభిస్తామన్నారు.
2007 బ్యాచ్‌కు చెందిన డీవీ శ్రీనివాస్ రావు.. మొన్నటి వరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు డీసీపీగా పని చేశారు. గతంలో కరీంనగర్ డీఎస్పీ, మహబూబ్‌నగర్ అడిషనల్ ఎస్పీగా, నల్లగొండ జిల్లా విజిలెన్స్ ఎస్పీగా సేవలందించారు.