నల్లగొండ రూరల్, జనవరి 13: గ్రామాల్లో సంక్రాంతి సందడి.. పండుగకు రెండు, మూడు రోజుల ముందు నుంచే మొదలవుతుంది. పిండి వంటల తయారీ ఈ పండుగలో ప్రత్యేకం. ఈ నేపథ్యంలో.. పిండి వంటలు చేసుకోవాలనుకునే ప్రజలకు వంట గ్యాస్ ధర మంట పుట్టిస్తున్నది. ఎనిమిదేండ్ల క్రితం రూ.470 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర.. ప్రస్తుతం రూ.1,124కు చేరింది. దీంతో నల్లగొండ మండలం జీ చెన్నారం గ్రామానికి చెందిన సోమనగోని అనిత పిండి వంటలను కట్టెల పొయ్యి మీద చేసేందుకు సిద్ధమైంది. శుక్రవారం తన వ్యవసాయ పొలం నుంచి కట్టెల మోపు ఎత్తుకొని వస్తుండగా ‘నమస్తే తెలంగాణ’ కెమెరాకు చిక్కింది. మోదీ ప్రజావ్యతిరేక విధానాల వల్లే వంట గ్యాస్ ధరలు మూడింతలు పెరిగాయని, పండుగ పూట మహిళలకు కష్టాలు తప్పడం లేదని అనిత వాపోయింది.