హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మాజీ సర్పంచ్‌లకు బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. వారంలో ఇవ్వకుంటే ఇందిరా పార్క్ వద్ద నిరసన చేపడుతామని ప్రకటించారు. సోమవారం తెలంగాణ భవన్లో రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ చైర్మన్ యాదయ్య, కార్యదర్శి రాజేందర్‌తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు కావస్తునాన మజీ సర్పంచ్ల పరిస్థితి దారుణంగా తయారైందని ఆందోళన వ్యక్తంచేశారు. రూ.1300 కోట్ల బకాయిలు పెండింగ్ ఉన్నాయని, కేంద్రం నుంచి వచ్చిన రూ.600 కోట్లు ఎకడికి పోయాయని ప్రశ్నించారు. పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే అమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.