దుబాయ్‌లో బతుకమ్మ సంబురాలు
ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్(ఈటీసీఏ) ఆధ్వర్యంలో దుబాయ్‌లోని షబాబ్ అల్ అహ్లీ స్పోర్ట్స్ క్లబ్లో 16వ బతుకమ్మ సంబురాలు అదివారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు బాలొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు.
- ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభం
- ముఖ్య అతిథిగా ప్రశాంత్‌రెడ్డి
- మెరిసిన సిరిసిల్ల నేతన్న
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్(ఈటీసీఏ) ఆధ్వర్యంలో దుబాయ్‌లోని షబాబ్ అల్ అహ్లీ స్పోర్ట్స్ క్లబ్లో 16వ బతుకమ్మ సంబురాలు అదివారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు బాలొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సంబురాలకు దుబాయ్ నలుమూలల నుంచి 6,000 మందికిపైగా తెలంగాణ ప్రవాసులు తరలివచ్చారు. ప్రాంగణమంతా అచ్చ తెలంగాణ పల్లె వాతావరణాన్ని తలపించింది. కేసీఆర్ పాటలకు బీఆర్ఎస్ నాయకులు ఉత్సాహంగా నృత్యం చేయగా, పలువురు మహిళలు కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలతో తీర్చిదిద్దిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ప్రజాప్రతినిధులు, ప్రముఖుల హాజరు
ఉత్సవాలకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, దుబాయ్ కాన్సుల్ జనరల్ డాక్టర్ ఇమ్మడి విష్ణువర్ధన్‌రెడ్డి గౌరవ అతిథులుగా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, గణేశ్ బిగాల, షకీల్ అమీర్, సురేందర్ జాజాల, బీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల, ఈటీసీఏ వ్యవస్థాపకుడు కిరణ్‌కు మార్, అధ్యక్షుడు జగదీశ్‌రావు కూడా పాల్గొన్నారు.
గల్ఫ్ కార్మికుల పక్షాన కానుక
ఈ వేడుకల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ దుబాయ్ పాలక కుటుంబసభ్యుల ముఖచిత్రాలను మగ్గంపై నేసిన శాలువా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దుబాయ్‌లోని అల్ అహ్లీ స్పోర్ట్స్ క్లబ్లో నిర్వహించిన వేడుకల్లో ఈ శాలువాను ఆవిషరించారు. ఈ శాలువాను త్వరలో దుబాయ్ పాలక కుటుంబానికి అధికారికంగా బహూకరించేందుకు ఈటీసీఏ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

