మహబూబాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): అక్రమాలకు పాల్పడిన మహబూబాబాద్ డీటీవో మహ్మద్ గౌస్పాషాతోపాటు డైవర్ ఎలమందల సుబ్బారావు,ప్రైవేట్ వ్యక్తి రాంగోపాల్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. డీటీవో గౌస్‌పాషాపై వాహనదారులు ఏసీబీ అధికారులకు లేఖ రాశారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. ఈ ఏడాది మే 28న మహబూబాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. డ్రైవర్ సుబ్బారావు వద్ద లెక్కల్లో చూపని 61,600 నగదుతోపాటు మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో గౌస్‌పాషా పనిచేసినపుడు కుమారుడు మహ్మద్ ఆరీపుద్దీన్, మేనల్లుడు మహ్మ ద్ మునీర్‌తో కలిసి రూ.2.97లక్షలు లంచం వసూలు చేసినట్టు విచారణలో తేలిం ది. ఇవి కాకుండా మరో రూ.38 వేలు కారు డ్రైవర్ సుబ్బారావు ద్వారా గ్రానైట్, ఏజెంట్లు, వాహనదారుల నుంచి వసూలు చేసి వివిధ బ్యాంకు ఖాతాలకు మళ్లించి డిపాజిట్ చేశా రు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఏ1గా డీటీవో మహ్మద్ గౌస్‌పాషా, ఏ2గా ఎలమందల సుబ్బారావు, ఏ3గా డీటీవో కుమారుడు అరిపుద్దీన్, ఏ4గా గౌస్‌పాషా మేనల్లుడు మహ్మద్ మునీర్, ఏ5గా తణుకు రాంగోపాల్‌పై కేసు నమోదు చేశారు. ఈ నెల 11న గౌస్‌పాషా, సుబ్బారావు, రాంగోపాల్‌లను అరెస్ట్ చేసి సోమవారం వరంగల్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరుచగా, జడ్జి వారిని రిమాండ్‌కు ఆదేశించడంతో పోలీసులు జైలుకు తరలించారు.