DSP Transfers | తెలంగాణలో పోలీసు అధికారుల బదిలీలు .. కొత్తగూడెం డీఎస్పీగా ఆదినారాయణ
DSP Transfers | తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఏసీపీ, డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ : తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఏసీపీ, డీఎస్పీలను బదిలీ ( DSP transfers ) చేస్తూ డీజీపీ ( DGP ) ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో సీసీఎస్‌లో ఏసీపీగా పనిచేస్తున్న ఎల్.ఆదినారాయణను కొత్తగూడెంకు డీఎస్పీ ( Kothagudem DSP ) గా
బదిలీ చేశారు. ఇక్కడ డీఎస్పీగా పనిచేస్తున్న అబ్దుల్ రహ్మన్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.
హైదరాబాద్ సీటీసీలో ఏసీపీగా పనిచేస్తున్న డీవీ. ప్రదీఫ్ కుమార్‌రెడ్డిని ఆదిబట్ల ఏసీపీగా బదిలీ చేశారు. సీఐడీ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న ఎం.ఆదిమూర్తిని మియాపూర్ ట్రాఫిక్ ఏసీపీగా , మల్కాజిగిరిలో ఏసీపీగా పనిచేస్తున్న ఎస్.చక్రపాణిని జవహర్‌నగర్ ఏసీపీగా, నగరంలో ఎస్బీ ఏసీపీగా పనిచేస్తున్న మోహన్ కుమార్‌ను మేడిపల్లి ఏసీపీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సిద్దిపేటలో టాస్క్‌ఫోర్స్‌లో ఏసీపీగా ఉన్న బి. రవీందర్‌ను భువనగిరి డీఎస్పీగా , యాంటి నార్కోటిక్ బ్యూరోలో డీఎస్పీగా ఉన్న సీహెచ్ శ్రీదర్‌ను మహాంకాళి ఏసీపీగా, టీజీపీఏలో డీఎస్పీగా పనిచేస్తున్న సారంగాపాణిని ఎల్దెండు డీఎస్పీగా ఇక్కడ డీఎస్పీగా పనిచేస్తున్న ఎన్. చంద్రబానును హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

