మహబూబాబాద్ రూరల్, అక్టోబర్ 6: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం మొట్లగూడెం ప్రాథమిక పాఠశాలకు వెంటనే ఉపాధ్యాయులను కేటాయించాలని డీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కెలోత్ సాయికుమార్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో వెంటనే ఉపాధ్యాయుల కొ రత తీర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. మొట్లగూడెం పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉండటంతో విద్యార్థులకు మెరుగైన విద్య అందడం లేదని, వెం టనే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని కోరా రు. అనంతరం అదనపు కలెక్టర్ లెనిన్వత్సల్టొప్పొ, జిల్లా విద్యా శాఖ అధికారి దక్షిణామూర్తికి వినతిపత్రం అందజేశారు.
భద్రాచలం, అక్టోబర్ 6 : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 25 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న డె యిలీవైజ్, ఔట్ సోర్సింగ్ కార్మికులు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మచారి, నాగేశ్వరరావు, కార్మికులు మాట్లాడు తూ.. రాష్ట్రంలోని అన్ని ఐటీడీఏల పరిధిలో పాత పద్ధతిలోనే కలెక్టర్ గెజిట్ ప్ర కారం వేతనాలు చెల్లిస్తుంటే.. భద్రాచలం ఐటీడీఏ పరిధిలో మాత్రం గెజిట్‌ను విస్మరించి కార్మికుల పొట్టకొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి ద్వంద్వ విధానం వల్ల ప్రతి కార్మికుడు రూ.16 వేల చొప్పున నష్టపోయారని మండిపడ్డారు. ఒకే శా ఖలో పని చేస్తున్న కార్మికులకు రెండు రకాలుగా జీతాలు చెల్లించడం ఏమిటని ప్రశ్నించారు. కలెక్టర్ గెజిట్ ప్రకారం చెల్లించకుం టే రాత్రిపూట ఆందోళన కొనసాగుతుంద ని పేర్కొన్నారు. జేఏసీ నాయకులతో డీడీ అశోక్‌కుమార్ చర్చించగా తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్పారు. దీంతో సమస్యను ఐటీడీఏ పీవోతో చర్చిస్తామని చెప్పారు.