హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): మినిమం టైం సేల్ పద్ధతిలో ఉద్యోగాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై డీఎస్సీ2008 బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం వారు సచివాల యం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్సీ2008 సెలక్టెడ్ మెరిట్ బీఈడీ క్యాండిడేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉమామహేశ్వర్ రెడ్డి, చంద్రశేఖర్,సంగమేశ్వర్ పాల్గొన్నారు.