డీఎస్సీ నియామకాలు రద్దు చేయాలి: ఎంఎస్ఎఫ్ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబ ర్ 9: సుప్రీంకోర్టు తీర్పు అమలుచేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతు న్న డీఎస్సీ నియామకాలను రద్దు చే యాలని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్(ఎంఎస్ఎఫ్) డిమాండ్ చేసింది. వర్గీకరణ చేసిన తరువాతనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఆ కమిటీ రాష్ట్ర అధ్యక్షు డు కొల్లూరి వెంకట్, కార్యనిర్వాహక అధ్యక్షుడు వరిగడ్డి చందు కోరారు. డీఎ స్సీ నియామకాలను వ్యతిరేకిస్తూ ఎంఎస్ఎఫ్ టీజీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిరాహార దీక్ష చేపట్టారు.
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రవాణా శాఖలో ప లు కీలక సంస్కరణలు తీసుకురానున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బుధవారం ఆయన రవాణా శాఖ కమిషనర్‌తో కలిసి సచివాలయం లో మీడియాతో మాట్లాడుతూ.. త్వర లో వెహికిల్ స్రాప్ పాలసీని అమలు చేయడంతోపాటు ఆటోమేటిక్ వెహికల్ టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని, వాహన్ సారథి పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు.