Viral Video | ఆర్టీసీ బస్సులో మందుబాబులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్, కండకర్ట్పై దాడికి దిగారు. పైగా నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తమ పెద్దన్నా అంటూ రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సులో వరంగల్ వద్ద ఇద్దరు మందుబాబులు ఎక్కారు. నర్సంపేటకు టికెట్ తీసుకున్నారు. తీరా నర్సంపేట వచ్చాక వారిని దిగాలని కండక్టర్ చెప్పడంతో మందుబాబులు వినిపించుకోలేదు. బస్సును పక్కన ఆపి, మత్తులో ఉన్న వారిని దించేందుకు ఆర్టీసీ సిబ్బంది ప్రయత్నించారు. దీంతో వారు రెచ్చిపోయారు.
నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మా పెద్దనాన్న, మమ్మల్నే లేపుతావా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్పై యువకులు దాడికి దిగారు. దీంతో ప్రయాణికులు కలగజేసుకుని ఇద్దరు యువకులను పోలీసులకు అప్పగించారు. ఇదంతా బస్సులోనే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.
మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్పై దాడి చేసిన పోకిరీలు
నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మా పెద్దనాన్న అంటూ ఆర్టీసీ సిబ్బందిపై దాడి
హైదరాబాద్ నుండి మహబూబాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో, వరంగల్ వద్ద బస్సు ఎక్కిన ఇద్దరు మందు బాబులు
నర్సంపేట వద్ద దిగాల్సి… pic.twitter.com/G8Lq2V4AW3
— Telugu Scribe (@TeluguScribe) November 26, 2025