మరికల్, జూన్ 18 : మద్యం మత్తులో ఓ వ్యక్తి విద్యుత్తు స్తంభం ఎక్కి హల్చల్ చేసిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది. పో లీసుల కథనం మేరకు.. జిన్నారం గ్రా మానికి చెందిన కృష్ణయ్య మరికల్‌లోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న కరెంట్ స్తంభం ఎక్కాడు. గమనించిన పోలీసులు విద్యుత్తు అధికారులకు ఫోన్ చేసి సరఫరా నిలిపివేయించా రు. అయినా అతడు కిందికి దిగి రా కుండా పిచ్చి చేష్టలు చేశాడు. కొద్దిసే పు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే పెద్దచింతకుంటకు చెందిన యువకుడు శ్రీకాంత్ పోల్‌పైకి ఎక్కి అతడిని కిందికి దించాడు. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. వ్యక్తి ప్రాణాలు కాపాడిన శ్రీకాంత్‌ను సీఐ రాజేందర్‌రెడ్డి, ఎస్సై మురళి అభినందించారు.