శంషాబాద్ రూరల్, నవంబర్ 1: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం డ్రగ్స్ పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి ఇక్కడికి డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు నిందితులను డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. బ్యాంకాక్ నుంచి విమానంలో వచ్చిన ఇద్దరు నిందితులను తెల్లవారుజామున డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. వారి బ్యాగుల్లో కెల్లాస్ ఫ్యాకెట్లు లభించాయి. వాటిని పరీక్షించగా డ్రగ్స్‌తో కలిసి ఉన్నట్టు గుర్తించారు. ఆ ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకొని డీఆర్ఐ కార్యాలయానికి తరలించారు. వారి వద్ద లభించిన 13 ప్యాకెట్లు 7.096 కిలోల బరువు ఉన్నట్టు తెలిపారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.7 కోట్ల వరకు ఉం టుందని తెలిపారు. ఈ మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.