పీజీ వైద్యవిద్యార్థులకు డీఆర్పీ తప్పనిసరి
పీజీ వైద్య విద్యార్థులు తప్పనిసరిగా ‘డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాం’ (డీఆర్పీ) పూర్తి చేయాల్సిందేనని నేషనల్ మెడికల్ కమిషన్ గురువారం ఆదేశాలు జారీ చేసింది. నెలలు జిల్లా దవాఖానల్లో విధులు నిర్వర్తించాలని సూచించింది
- 2021 బ్యాచ్ నుంచి అమలు : ఎన్ఎంసీ
హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): పీజీ వైద్య విద్యార్థులు తప్పనిసరిగా ‘డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాం’ (డీఆర్పీ) పూర్తి చేయాల్సిందేనని నేషనల్ మెడికల్ కమిషన్ గురువారం ఆదేశాలు జారీ చేసింది. నెలలు జిల్లా దవాఖానల్లో విధులు నిర్వర్తించాలని సూచించింది. దీనిని 2,4,5వ సెమిస్టర్లలో అమలు చేయాలని తెలిపింది. డీఆర్పీని 2020 నుంచే అమలు చేయాలని ఎన్ఎంసీ భావించింది. కొవిడ్ కారణంగా అమలు కాలేదు. డీఆర్పీ నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని 2020 బ్యాచ్ విద్యార్థులు వేడుకొన్నారు. దీంతో వారికి మినహాయింపు ఇచ్చింది.
2021 బ్యాచ్ నుంచి డీఆర్పీని అమలు చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, డీమ్డ్ వర్సిటీల విద్యార్థులు తప్పనిసరిగా దీనిని పూర్తి చేయాల్సిందేనని చెప్పింది. కనీసం 100 పడకలు, ఆపై సామర్థ్యం ఉన్న దవాఖానలకే విద్యార్థులను కేటాయించాలని డీఎంఈలను ఆదేశించింది. విద్యార్థులకు వసతిని దవాఖాన ప్రాంగణంలో లేదా 2 నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేయాలని సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

