హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : పాఠశాల స్థాయిలోనే కాదు.. ఇంటర్ విద్యలోనూ డ్రాపౌట్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంటర్లో చేరిన విద్యార్థుల్లో కొందరు డ్రాపౌట్ అవుతున్నారు. పైచదువులు చదవలేకపోతున్నారు. అత్యధికులు ఆర్థిక చిక్కులతోనే చదువులకు ఫుల్స్టాప్ పెడుతున్నట్టు ఇంటర్ విద్యాధికారుల అధ్యయనంలో తేలింది. ఆర్థిక సమస్యలతో 20% డ్రాపౌట్ అవుతున్నట్టు వెల్లడయ్యింది. మరో 15% మంది మానసిక ఒత్తిడితో ఇంటర్‌కు గుడ్‌బై చెబుతున్నట్టు తేల్చింది.
2024-25 విద్యాసంవత్సరంలో 1,60,127 మంది సర్కారు కాలేజీల్లో ప్రవేశాలు పొందగా పరీక్షలు రాసింది కేవలం 1,26,845 మందే. అంటే దాదాపు 34వేల మంది డ్రాపౌట్ అయ్యారు. 2023-24లో 1.60లక్షల మంది నమోదుకాగా, పరీక్షలు రాసింది 1,46,975 మందే. అంటే ఈ ఒక్క ఏడాదే 14వేల మంది డ్రాపౌట్ అయ్యారు. డ్రాపౌట్స్ నేపథ్యంలో అధికారులు ఓ సర్వే చేయించారు. సర్వేకు సంబంధించిన కొన్ని వివరాలిలా ఉన్నాయి.