మెదక్ : మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. రెండు కాలేజీ బస్సులు ఢీ కొనడంతో ఓ డ్రైవర్ మృతి(Driver killed) చెందగా 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే..మెదక్ జిల్లా నర్సాపూర్(Narsapur) సమీపంలో బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన రెండు కాలేజీ బస్సులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులకు గాయాలవ్వగా డ్రైవర్ నాగరాజు మృతి చెందాడు. మరో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది.
ఘోర రోడ్డు ప్రమాదం..
మెదక్ జిల్లాలో నర్సాపూర్ సమీపంలో రెండు కాలేజీ బస్సులు ఢీ..
బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన రెండు బస్సులు ఢీ..
చికిత్స పొందుతూ డ్రైవర్ నాగరాజు మృతి..
20 మందికి పైగా విద్యార్థులకు గాయాలు..
మరో డ్రైవర్ పరిస్థితి విషమం.. pic.twitter.com/MMCFvOQJYi
— Telugu Scribe (@TeluguScribe) September 27, 2024