వర్గల్, మే 31 : సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో ధాన్యం లోడ్‌తో డీసీఎం ్రడ్రైవర్ ఉడాయించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రైతుల కథనం ప్రకా రం.. కుకునూర్‌పల్లి మండలం తిప్పారం కేంద్రం నుంచి 8మంది రైతులకు చెంది న 491 ధాన్యం బస్తాలు లోడ్ చేసుకొని వర్గల్ టీజీఐఐసీలోని శ్రీమహాదేవి ఆగ్రో ఇండస్ట్రీస్‌కు మే 28వ తేదీ రాత్రి వాహ నం బయల్దేరింది. అన్లోడ్కు సమయం పడుతుందని సిబ్బంది చెప్పడంతో, తిప్పారం రైతులు వెళ్లిపోయి, 29న ఆగ్రో ఇండస్ట్రీస్ సెంటర్‌కు వచ్చి చూసే సరికి, డీసీఎం వ్యాన్ లేకపోవడంతో రైతులు వర్గల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు.