కమాన్చౌరస్తా, మే 18: ఎప్సెట్ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు ఘనవిజయం సాధించారని ఆ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి చెప్పారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కళాశాలకు చెందిన వీ హాసిని 114, ఎన్ హేమంత్ 157, జీ శ్రీహాస్ 166, కే సుప్రియ 296, ఎన్ జ్ఞానద 480, వీ శ్రీముఖి 568, ఎం వర్షిత్ 575, జీ సాయిమంజునాథ్రెడ్డి 610, పీ జ్యోతిర్మయిరెడ్డి 863, శ్రీ వెన్నెల 876, తేజస్విని 942, ఏ శివవరుణ్ 973, సీహెచ్ అనూహ్య 950, పీ శ్రీనాథ్ 986, మలిహాఫాతిమా 992వ ర్యాంకు సాధించారని తెలిపారు.
1,000 లోపు 16 ర్యాంకులు, 2,000లోపు 39 ర్యాంకులు, 3,000లోపు 63 ర్యాంకులు, 5,000లోపు 116 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారని వివరించారు.