హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): అత్యధిక ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా (పీఈఆర్పీ) చికిత్సలు చేసినందుకుగాను డాక్టర్ సుధీర్ దారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు ఆయనకు సర్టిఫికెట్ ప్రదానం చేశారు.
మోకాలి నొప్పి, భుజాల నొప్పి, యాంకిల్తోపాటు అన్ని రకాల కీళ్ల నొప్పులకు ఈ థెరపీతో ఆయన చికిత్స చేశారు. 2018 అక్టోబర్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు ఆయన 3,500 ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీలను విజయవంతంగా నిర్వహించారు.