హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద బాధితులను దవాఖానలకు తరలించిన అంబులెన్స్‌లలో ఆక్సిజన్ సిలిండర్లు లేవనే ప్రచారాన్ని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్‌నాయక్ ఖండించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం 8 అంబులెన్స్‌లను ఘటనా స్థలానికి పంపామని, బాధితులను ఉస్మానియా, కేర్, అపోలో, యశోద దవాఖానలకు తరలించామని తెలిపారు.
తొలి పేషెంట్‌ను ఉదయం 6:25 గంటలకు ఉస్మానియా దవాఖానకు తరలించినట్టు స్పష్టంచేశారు. ఘటన విషయం తెలిసిన మరుక్షణమే అప్రమత్తమై వెంటనే వైద్యుల బృందాన్ని పంపించామని వివరించారు. ప్రతి అంబులెన్స్‌లోనూ ఆక్సిజన్ సౌకర్యం ఉన్నదని, ఆక్సిజన్ సిలిండర్లు లేవనే తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని ఆయన విజ్ఞప్తిచేశారు.