హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ సెకండ్ లాంగ్వేజ్‌గా సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని పూర్వ ఐఏఎస్ అధికారి, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ రమణాచారి విజ్ఞప్తిచేశారు.
సంస్కృతాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవడంలో తప్పులేదని.. అలాగే తెలుగు భాషను విద్యార్థులను దూరం చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులకు అటు తెలుగుపై, ఇటు సంస్కృతంపై పట్టులేకుండాపోయే అవకాశం ఉన్నదని అభిప్రాయపడ్డారు. విద్యార్థులను తెలుగుభాషకు దూరం చేస్తే.. మాతృభాషకు అన్యాయం చేసినట్టే అవుతుందని అన్నారు. ఇంటర్మీడియట్లో తెలుగును సెకండ్ లాంగ్వేజ్‌గా కొనసాగించాలని తెలుగు భాషాభిమానిగా తాను కోరుకుంటున్నట్టు రమణాచారి వివరించారు.