బంజారాహిల్స్,డిసెంబర్ 12: ప్రతిష్ఠాత్మక కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా(సీఎస్ఐ) అధ్యక్షుడిగా హైదరాబాద్‌లోని అపోలో కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ పీసీ రథ్ ఎన్నికయ్యారు. చెన్నైలో జరుగుతున్న సీఎస్ఐ వార్షిక సదస్సులో ఆయనను 202324 సంవత్సరానికి ఎన్నుకొన్నారు.
పీసీ రథ్‌ను ప్రస్తుత సీఎస్ఐ అధ్యక్షుడు డాక్టర్ వీహెచ్ బంగ్, డాక్టర్ పీసీ బెనర్జీ, అపోలో దవాఖాన వైద్యులు తదితరులు అభినందించారు.