హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(టీజీజీడీఏ) రాష్ట్ర కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ నరహరి, సెక్రటరీగా డాక్టర్ లాలుప్రసాద్ రాథోడ్, కోశాధికారిగా ఏ లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులుగా డాక్టర్ బీ ఉమాకాంత్‌గౌడ్, డాక్టర్ ఏ కృష్ణారావు,
డాక్టర్ ఆర్ దీనదయాల్, డాక్టర్ సీహెచ్ కల్యాణ్, కార్యదర్శులుగా డాక్టర్ జే భూపేందర్‌సింగ్ రాథోడ్, డాక్టర్ ఎం విష్ణువర్ధన్, డాక్టర్ ఏ విశాల్, డాక్టర్ కే రమేశ్, డాక్టర్ వీ రవి ప్రవీణ్ రెడ్డి ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు నరహరి మాట్లాడుతూ సమస్యలపై పోరాడుతామని చెప్పారు.