హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ యూనివర్సిటీ పరిశోధనా విభాగం డైరెక్టర్‌గా డాక్టర్ ఎం వెంకటరమణను నియమించారు.
ప్రస్తుత డైరెక్టర్ జగదీశ్వర్ మంగళవారం పదవీ విరమణ చేయగా, ఆయన స్థానంలో వెంకటరమణను నియమిస్తూ ఇన్చార్జి వీసీ రఘునందన్‌రావు ఆదేశాలు జారీ చేశారు. జగదీశ్వర్‌కు వర్సిటీలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.