హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ పార్థివదేహానికి వ్యవసాయ శాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నివాళి అర్పించారు. శనివారం వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కేశవులుతోపాటు చెన్నై వెళ్లిన నిరంజన్‌రెడ్డి.. స్వా మినాథన్ అంత్యక్రియాల్లో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. స్వామినాథన్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశా రు. తద్వారా శాస్త్రవేత్తలను, ఈ దేశ రైతాంగాన్ని, వ్యవసాయరంగాన్ని గౌరవించినట్టు అ వుతుందని పేర్కొన్నారు.
స్వామినాథన్ లాంటి వారు యుగానికొకరు పుడతారని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ఆకలితో అలమటించి లక్షల మంది చనిపోయిన పరిస్థితిని చూసి చలించిపోయిన ఆయన.. వైద్య విద్యను వదిలేసి వ్యవసాయ పరిశోధకుడిగా మారారని గుర్తుచేశారు. ఈ వందేండ్లలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన అతి కొద్దిమందిలో అద్భుతమైన శాస్త్రవేత్తల్లో స్వామినాథన్ ఒకరని కొనియాడారు. ఆయన సారథ్యంలో ఏర్పడిన కమిషన్ రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని సూచించిందని, కానీ బీజేపీ ప్రభుత్వం అమ లు చేయకుండా రైతాంగానికి అన్యాయం చేసిందని మండిపడ్డారు. 2 నెలల క్రితమే వా రిని వ్యక్తిగతంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నామని గుర్తుచేశారు. ఆరోగ్యం కుదుటపడితే తెలంగాణకు వచ్చి అభివృద్ధిని చూస్తానని చెప్పారని వెల్లడించారు. తెలంగాణ రైతాంగం, ప్రజలు, ప్రభుత్వం పక్షాన వారికి శిరస్సు వచ్చి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టు తెలిపారు.