హైదరాబాద్, మే 5(నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వ బోధన వైద్యుల సంఘం(టీటీజీడీఏ) కార్యవర్గాన్ని ఎన్నుకొన్నారు. ఆదివారం సంఘం రాష్ట్రస్థాయి సమావేశంలో రెండేండ్ల కాలానికి కార్యవర్గాన్ని ప్రకటించారు. నూతన అధ్యక్షుడిగా డాక్టర్ బొల్లెపాక కిరణ్కుమార్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ కిరణ్మాదల, కోశాధికారిగా డాక్టర్ ఎల్ రమేశ్, ఉపాధ్యక్షుడిగా డాక్టర్ కిరణ్ప్రకాశ్ ఎన్నికయ్యారు. ఏడు జోన్లకు ప్రాంతీయ కార్యదర్శులు, కార్యవర్గసభ్యుల నియామకం చేపట్టారు.