హైదరాబాద్, మార్చి 29(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంటులో అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ దాసరి వెంకటరమణ రచించిన ‘ఆనందం’ అనే కథల సంపుటికి మహారాష్ట్రలో పాఠ్యాంశంగా చోటుదక్కింది.
ఈ పుస్తకాన్ని సోలాపూర్ యూనివర్సిటీలో బీఏ డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులకు పాఠ్యాంశంగా తీసుకున్నారు. ఈ రచనకు గాను 2014లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.