Dr. Chandrika | నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన స్త్రీ వైద్యనిపుణురాలు చంద్రిక అవినాష్ మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ ఫైనల్స్‌కు ఎంపికయ్యారు. గ్లామర్ గుర్గావ్ మ్యాగ్లిన్ ఆధ్వర్యంలో వివాహితులకు హైదరాబాద్‌లో శనివారం రాత్రి నిర్వహించిన పోటీల్లో 50 మంది పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొన్న డాక్టర్ చంద్రిక ఫైనల్స్‌కు అర్హత సాధించారు. ఈ మేరకు ఆమె మే 28 నుంచి జూన్ 1 వరకు గుర్గావ్ ఢిల్లీలో జరిగే ఫైనల్ పోటీల్లో పాల్గొననున్నారు. -నిర్మల్ అర్బన్