Voter Slip | తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు సోమవారం జరుగనున్నది. పోలింగ్‌కు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నది. ఇప్పటికే ఎన్నికల సంఘం పోల్ చిట్టీలను పంపిణీ చేసింది. అయితే, చాలామంది తమకు ఓటర్స్లిప్స్ రాలేదని పేర్కొంటున్నారు. అయితే స్మార్ట్‌ఫోన్స్, కంప్యూటర్స్లు ఉన్న వారంతా ఇంటివద్దనే ఓటర్ స్లిప్‌ను డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించింది. ఓటర్స్లిప్స్ రానివారంతా electoralsearch.eci.gov.in వెబ్సైట్లోకి లాగిన్ కావాలి.
ఇక్కడ మూడు ఆప్షన్ కనిపిస్తాయి. ఓటర్ ఐడీ నంబర్, రాష్ట్రం పేరు, క్యాప్చా ఎంటర్ చేయగానే వివరాలు కనిపిస్తాయి. అందులో పేరు, ఓటర్ ఐడీ వివరాలు, పోలింగ్ బూత్‌కు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఓటర్ లిస్టులో సీరియల్ నెంబర్‌తో సహా బూత్ నంబర్, పోలింగ్ బూత్ అడ్రస్ అన్నీ ఉంటాయి. ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా కూడా ఓటర్ స్లిప్ వివరాలు తెలుసుకునేందుకు అవకాశం ఉంది. గూగుల్ ప్లేస్టోర్‌కి వెళ్లి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో ఎలక్టోరల్ రోల్ సెర్చ్ ఆప్షన్ ద్వారా ఓటర్ స్లిప్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అందులో క్యూఆర్ కోడ్ స్కాన్ ఆప్షన్ సైతం ఉంటుంది. ఈ యాప్‌లోని స్కానర్ ద్వారా మీ ఓటర్ ఐడీని స్కాన్ చేస్తే అవసరమైన సమాచారం కనిపిస్తుంది. ఆ వివరాలు వాట్సాప్, మెయిల్ ద్వారా షేర్ చేసుకొని ప్రింట్ తీసుకుని ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కి వెళ్లొచ్చు. అలాగే, ద్వారా కూడా ఓటరు సమాచారాన్ని పొందొ అవకాశం ఉంది. 1950 నంబర్‌కు ఈసీఐ అని టైప్ చేసి స్పేస్ ఇవ్వాలి. ఓటర్ ఐడీ (ECI XXXXXXXXXX) ఎంటర్ చేసి మెసేజ్ పంపాలి. కొద్దిసేపట్లోనే పోలింగ్ బూత్ పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ వివరాలతో మెసేజ్ రూపంలో వస్తాయి. మరి మీకు ఓటర్ స్లిప్ రాకపోతే ఈ మూడు పద్ధతుల్లో ట్రై చేసి చూడండి..!