హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): పేదరిక నిర్మూలనలో డబుల్ ఇంజిన్ సర్కారు వెలవెలబోయిందంటూ నీతి ఆ యోగ్ తాజా నివేదిక స్పష్టం చేసిందని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో పేదరిక నిర్మూలనకు చేపట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ, గుజరాత్ మధ్య తేడా ఉందని, తెలంగాణ కంటే గుజరాత్ అన్నిరంగాల్లో వెనుకబడి ఉందని మరోసారి తేలిపోయిందని పేర్కొన్నారు.