గుజరాత్ మాడల్ పచ్చి గోల్మాల్
- డబుల్ ఇంజిన్ సర్కార్ ఉత్తదే
- అహ్మదాబాద్‌లో మురికివాడలు
- సబర్మతి నదిలోకి మురుగు నీరు
- తెలంగాణకు నీతులు చెప్పే అమిత్ షా తన ఇంటి వెనుక ఓ సారి చూసుకోవాలి
- తాజా వీడియోల్లో టీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్
హైదరాబాద్, ఆగస్టు 22, (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులు గొప్పగా చెప్పుకొనే గుజరాత్ మాడల్ అన్నది పచ్చి గోల్మాల్ అని, డబుల్ ఇంజిన్ సర్కార్ ఒట్టి ట్రాష్ అని టీఆర్ఎస్ నాయకుడు, రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ క్రిషాంక్ పేర్కొన్నారు. దీన్ని నిరూపించే సాక్ష్యాధారాలతో ఆయన మరో 3 వీడియోలను విడుదల చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వరాష్ట్రమైన గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ దుస్థితిని కళ్లకు కట్టే కథనాలను క్రిషాంక్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల నాటికి దేశంలో ప్రతి ఒక్కరికీ పక్కా ఇండ్లు నిర్మించి ఇస్తామన్న ప్రధాని మోదీ హామీని ప్రస్తావిస్తూ.. స్మార్ట్ సిటీగా చెప్పుకొనే అహ్మదాబాద్‌లోని మురికివాడలను ఈ వీడియోల్లో చూపించారు.
గతంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అహ్మదాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు అక్కడి మురికివాడలు కనిపించకుండా పరదాలను అడ్డం పెట్టిన దృశ్యాన్ని, ఆ పరదాల వెనుక ఉన్న మురికివాడలను ఈ వీడియోలో పొందుపర్చారు. తెలంగాణలో మూసీ నది ప్రక్షాళనపై బీజేపీ నాయకులు మాట్లాడుతున్న మాటలను క్రిషాంక్ ప్రస్తావిస్తూ.. అమిత్ షా సొంత నియోజకవర్గమైన గాంధీనగర్‌లో సబర్మతి నదిలోకి మురికి కాలువ ప్రవహిస్తున్న దృశ్యాన్ని చూపించారు. తెలంగాణకు వచ్చినప్పుడు స్వచ్ఛ భారత్ అని, టాయిలెట్లు కట్టిస్తామని పెద్దపెద్ద మాటలు చేప్పే మోదీ, అమిత్ షా.. అహ్మదాబాద్‌లోని మురికికూపాలు, రోడ్ల దుస్థితి గురించి ఏమి చెప్తారని క్రిశాంక్ నిలదీశారు. తెలంగాణకు వచ్చి నీతులు చెప్పడానికి ముందు గుజరాత్లో మీ ఇంటి వెనుక చూసుకో’ అంటూ అమిత్ షాకు చురక అంటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

