దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
సోన్, సెప్టెంబర్ 4: పేదింటి ఆత్మగౌరవాన్ని పెంచేలా ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నదని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా చిట్యాల్ గ్రామంలో రూ.3.51 కోట్ల వ్యయంతో నిర్మించిన 71 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శనివారం లబ్ధిదారులకు అందజేశారు. ముందుగా ‘ఐకే రెడ్డి కాలనీ’ పేరిట ఉన్న స్వాగత తోరణం, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నిర్మల్ నియోజక వర్గానికి ఇప్పటివరకు 3,761 ఇండ్లు మంజూరు కాగా, నిర్మల్ పట్టణంలో 2,200 ఇండ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. మిగతా గ్రామాల్లో నిర్మించిన 1,500 ఇండ్లను త్వరలో లబ్ధిదారులకు అప్పగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పాల్గొన్నారు.