పెద్దవంగర, ఫిబ్రవరి 15: తెలంగాణకు అన్ని విధాలుగా అన్యాయం చేసిన ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయొద్దని మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం అవుతాపురం గ్రామస్థులు ఆందోళన చేశారు. వైఎస్సార్ టీపీ అధినేత షర్మిల చేస్తున్న ప్రజాప్రస్థాన యాత్ర గురువారం అవుతాపురం గ్రామంలో కొనసాగనుండగా.. నిర్వాహకులు వైఎస్సార్ విగ్రహాన్ని నెలకొల్పారు. దీంతో వైఎస్ పాలనలో తెలంగాణ రాష్ర్ర్టాన్ని అడ్డుకున్నారని, అలాంటి ద్రోహి విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేయొద్దని స్థానికులు స్పష్టం చేశారు.