హైదరాబాద్, జనవరి 27(నమస్తే తెలంగాణ): యూనివర్సిటీల్లో బోధన సిబ్బంది పదవీ విరమణ వయస్సును 65 ఏండ్లకు పెంచాలనే ప్రభుత్వ ఆలోచనను తెలంగాణ వెటర్నరీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్(టీవీజీఏ) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కాటం శ్రీధర్ పేరొన్నారు. సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రకటనను ఖండించారు. ఈ నిర్ణయం వల్ల నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పీజీ, పీహెచ్డీలు చేసిన ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పదవీ విరమణ వయస్సు పెంచడం బాధాకరమని వాపోయారు. ఈ ఆలోచనను వి రమించుకోవాలని డిమాండ్ చేశారు. దీం తోపాటు వెంటనే ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని కోరారు. లేనిపక్షం లో నిరుద్యోగులంతా ఒక్కటై రాష్ట్రవ్యాప్తం గా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఉద్యోగుల వయోపరిమితి పెంపు వద్దు ;ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర డిమాండ్
హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగుల వయోపరిమితిని పెంచొద్దని, ప్రభుత్వం ఆ ఆలోచనను వెం టనే విరమించుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర కార్యదర్శి కే ధర్మేంద్ర డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్లోని సంఘం కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉద్యోగుల వయోపరిమితి పెంపుతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే 58 ఏండ్లుగా ఉన్న రిటైర్మెంట్ వయసును 61 ఏండ్లకు పెంచారని, మళ్లీ దానిని పెంచాలనే ప్రతిపాదన సరికాదని తెలిపారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు తాత్సారం చేస్తున్నదని మండిపడ్డారు. ఉద్యోగ వయోపరిమితి వయసును పెంచాలనే కుట్ర చేస్తే ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యప్రసా ద్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు బాలకృ ష్ణ, మాజిద్, కల్యాణ్, పాల్గొన్నారు.