హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా ఆయుష్ కేంద్రాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఫార్మాసిస్టులను డిస్కంటిన్యూ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 28న జారీ చేసిన జీవో-65లో 308 ఆయుష్ ఫార్మాసిస్టు పోస్టులకు గానూ విద్యార్హతగా అల్లోపతి(ఇంగ్లిష్ మెడిసిన్)లో డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఫార్మ్ డీగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆ యుష్ కాంట్రాక్టు ఫార్మాసిస్టులను జూన్ 30 వరకు డిస్కంటిన్యూ చేయొద్దని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 4 వారాల్లో కౌం టర్ దాఖలు చేయాలని సూచించింది.
వారసత్వ సంపదను పరిరక్షించుకుందాం ; పర్యాటకశాఖ మంత్రి జూపల్లి
హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): వారసత్వం సమాజ మనుగుడకు మైలురాయిగా నిలుస్తున్నదని, వారసత్వ సంపదను పరిరక్షిం చి దానిని భవిష్యత్తుతరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక పురావస్తుశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ ఏడాది ప్రకృతి విపత్తులు, సంఘర్షణలతో అనేక వారసత్వ ప్రదేశాలు ఎదురొంటున్న సవాళ్లపై దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు.
కలెక్టర్‌పై తెనేటీగల దాడి
వీర్నపల్లి, ఏప్రిల్18: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాపై తెనేటీగలు దాడి చేశాయి. శుక్రవారం వీర్నపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన అనంతరం ఆయన కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయానికి చేరుకున్నారు. మధ్యా హ్న భోజనం, స్టోర్ రూమ్‌ను పరిశీలించి విద్యార్థినుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఓ విద్యార్థిని భవనం పై అంతస్థు నుంచి దూకగా, ఆ కారిడర్‌ను పరిశీలించేందుకు కలెక్టర్, అధికారులు, కాంగ్రెస్ నాయకులు మొ దటి అంతస్థుకు చేరుకున్నారు. ఈ క్రమంలో తెనేటీగలు ఒకసారిగా దాడిచేశాయి. దీంతో వారిని పకనే ఉన్న గదిలోకి పంపి తలుపు లు వేశారు. స్వల్పగాయాలు అయ్యాయి.